సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 11: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోనీ గర్రెపల్లి, భూపతిపూర్, సాంబయ్య గ్రామాల్లో మంగళవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ..గింజ కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలి సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జానీ, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పడాల అజయ్ గౌడ్, మాజీ సర్పంచులు సత్యనారాయణ రావు, రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బక్కయ్య, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.