Pahalgam Terror Attack | పెద్దపల్లి టౌన్, ఏప్రిల్ 29 : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇవాళ చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో పెద్దపల్లి బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో పెద్దపెల్లి పట్టణంలోని వర్తక, వ్యాపార, కూరగాయల దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా, కూరగాయల మార్కెట్, కమాన్ రోడ్, అయ్యప్ప టెంపుల్, బస్టాండ్, అమర్ నగర్, శాంతినగర్, చీకురాయ్ రోడ్లో వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని అమరులకు నివాళులర్పించారు.
పెద్దపల్లి చాంబర్స్ ఆఫ్ కామర్స్ నాయకులు, సభ్యులు సయ్యద్ మస్రత్ ,శారద, రమేష్, వినోద్ కుమార్, జంగ చక్రధర్ రెడ్డి, పర్స సమ్మయ్య, క్రాంతి కుమార్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాజం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 22న జమ్మూకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి