పెద్దపల్లి రూరల్ జూలై 03: గ్రామాల్లో వానకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీడీవొ కొప్పుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లిలోని రైతు వేదికలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ, పంచాయతీ సిబ్బందిచే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రధానంగా పారిశుద్ద్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మురికి కాలువలు, నీటి మడుగుల్లో నీరు నిల్వలు లేకుండా చూడాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను సిద్దం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ, ఏపీవో రమేష్ బాబు, జేఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.