సుల్తానాబాద్ రూరల్ ఫిబ్రవరి 13 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్, సెంటర్(Chicken and Mutton centers) దుకాణ యజమానులు శుభ్రత పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ నియాజ్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రం లోని పలు చికెన్, మటన్, సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సి పల్ కమిషనర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం చికెన్, మటన్, సెంటర్ యజమానులు తమ దుకాణాలలో శుభ్రత పాటించి వ్యర్థ పదార్థాలు నిలువ లేకుండా చూడాలన్నారు.
బ్లీచింగ్ పౌడర్ చల్లి ఈగలు, దోమలు దరిచేరకుండా చూడాలని, స్వచ్ఛమైన మంచినీరును శుభ్రపర చేందుకు వాడాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన చికెన్, మటన్, విక్రయించాలని, ఎట్టి పరిస్థితిలో మృతి చెందిన కోళ్లను, మేకలను, కోసి విక్రయించవద్దని సూచించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే సహించమని హెచ్చరించారు. అలాగే కోళ్లు , మేకలు నుంచి వచ్చిన వ్యర్థాన్ని డ్రైనేజీలలో ఊరు చివర రోడ్ల పక్కన పడేసిన వారిపై చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామనన్నారు. శుభ్రత పాటించకపోతే జరిమానాలు తప్పవని ఇకనుండి నుంచి తరచూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు.