
హైదరాబాద్ : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాను ప్రసాదరావు ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి భాను ప్రసాదరావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం భాను ప్రసాదరావు మంత్రిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ సహకారం అందించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు.