కాల్వ శ్రీరాంపూర్ అక్టోబర్ 23 : రైతులు ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆదనపు కలెక్టర్ దాసరి వేణు తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారుల నమ్మి మోసపోకుండా పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
మరో వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని, రైతులు ఎవరు అధైర్య పడవద్దు అని సూచించారు. అనంతరం పంటలకు సంబంధించిన మద్దతు ధర పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెసి వేణు, మార్కెట్ డిఎం ప్రవీణ్ రెడ్డి, మార్క్ఫెడ్ ఎగ్జిక్యూటివ్ మునవర్, కార్యదర్శి ప్రేమ్ కుమార్, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, తహసిల్దార్ జగదీశ్వరరావు, డిటి శంకర్, విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి తల్లి రామిడి రాధమ్మ మీర్జం పేటలో ఇటీవల మృతిచెందగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.