పాలకుర్తి : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో హనుమాన్ దేవాలయం నిర్మిస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పేర్కొన్నారు. కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకి సోమవారం ఎమ్మెల్యే ముగ్గు పోశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని పది లక్షలతో నిర్మాణం చేయిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
అదేవిధంగా అర్హులైన వారందరికి రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచి ప్రజలకు ఉచిత వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.