రామగిరి మార్చి 05: రాష్ట్ర ప్రభుత్వం రత్నాపూర్ గ్రామ పరిధి లోని మేడిపల్లి భూముల సేకరణ ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని మేడిపల్లి బాధిత రైతులు తేల్చి చెప్పారు. పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటీసులో 60 రోజుల లోపు గ్రామ రైతులు తమ అభ్యంతరాలను తెలుపగలరని పేర్కొన్నారు. కానీ మేడిపల్లి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు పంటలు పండే భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
భూ సేకరణ కోసం చేపట్టే చర్యలను ఆపాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, మంథని ఆర్డిఓ, రామగిరి ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చినా వారి నుండి ఇప్పటివరకు ఎలాంటి జవాబు రావడం లేదని, ఇకనైనా అధికారుల నుంచి జవాబు రాకపోతే ఈ రెండు రోజుల్లో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపడతామని రైతులు హెచ్చరించారు. మరి ఒకసారి ముందస్తు కార్యాచరణలో భాగంగా రామగిరి తహసిల్దార్ ఆఫీస్ లో మేడిపల్లి రైతులు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రామగిరి మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్, రత్నాపూర్ మాజీ ఎంపీటీసీ ధర్మల సంపత్, రత్నాపూర్ మాజీ వార్డు సభ్యులు చామంతి-కృష్ణ, మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.