పెద్దపల్లి, మార్చి 04(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ఆవరణలోని మదర్ అండ్ చైల్డ్‌హెల్త్ కేర్ సెంటర్లో త్వరలోనే మెకనైజ్డ్ లాండ్రీ మిషన్స్సేవలు(Mechanized laundry services) అందుబాటులోకి రానున్నట్లు పెద్దపల్లి డీసీహెచ్ఎస్ కొండ శ్రీధర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు జిల్లా అభివృద్ధి ప్రత్యేక నిధులతో జిల్లా దవాఖానలోని రోగులకు స్వచ్ఛమైన సేవలను అందించడంలో భాగంగా మెకనైజ్డ్ లాండ్రీ మిషన్స్‌ను బిగించినట్లు తెలిపారు.
ఈ సేవలకు గాను ప్రత్యేకంగా రూ.5లక్షల వ్యయంతో షెడ్డును నిర్మించామన్నారు. ఈ సేవల ద్వారా రోగులకు సంబంధించిన బెడ్ షీట్స్, ఆపరేషన్ థియేటర్‌కు సంబంధించిన బట్టలు ఉతకడం, ఇస్త్రీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ రోజు వాడిన బట్టలను ఈ మిషన్స్‌లో వేయడం వల్ల మరునాడు శుభ్రంగా ఉపయోగించే విధంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇస్తుందన్నారు. త్వరలోనే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా ఈ సేలను జిల్లా దవాఖానలో ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.