Ramagundam Mayor | వరద ముప్పు నివారణకు కాలువల్లో పూడిక తొలగింపు..!
Ramagundam Mayor : యుద్ద ప్రాతిపదికన కాలువల్లోని పూడిక తొలగించి వరద ముప్పు నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
Ramagundam Mayor : యుద్ద ప్రాతిపదికన కాలువల్లోని పూడిక తొలగించి వరద ముప్పు నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా శనివారం ఒకటవ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ), కమిషనర్ జె, అరుణ శ్రీతో కలిసి ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా పి కె. రామయ్య కాలనీ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన మేయర్ కాలువల్లో పూడికతీతకు ఆదేశించారు. జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, చైన్ జేసీబీ, బాబ్ కార్ట్, జెట్టింగ్ యంత్రం, పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో కాలనీ వీధుల్లో పూడుక పోయిన ఉపరితల కాలువను పూర్తిగా శుభ్రం చేయించారు.
పి కె. రామయ్య కాలనీలోని కాలువ చుట్టురా, లోపలా పేరుకుపోయిన తుప్పలు, పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. వీధుల్లో నడవడానికి వీల్లేకుండా రోడ్డు మీదకు అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను బ్లేడ్ యంత్రం సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళ బాపు, నగర పాలక సంస్థ ఎస్ ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఏఈ తేజస్విని, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, సీనియర్ అకౌంటెంట్ రాజ్ కుమార్, జవాన్ సూర్య, నగర పాలక సంస్థ సిబ్బంది, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

