మంథని రూరల్: అక్రమంగా నిల్వి చేసిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..మంథని మండలం సూరయ్యపల్లి గ్రామ పంచాయతీ శివారులో గల ఓ గదిలో అక్రమంగా నిలువ ఉంచారనే సమాచారం మేరకు సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి సుమారు 61బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలకు ఉచితంగా అందిస్తున్నపీడీఎస్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అధికారులతో కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారని, అక్రమార్కులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.