పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లాలో మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లికి చెందిన ఓ రైతు నుంచి భూమి సర్వే చేసిన రిపోర్టు ఇవ్వడానికి సర్వేయర్ లంచం డిమాండ్ చేశాడు. అందుకు సదరు రైతు కొంత మొత్తం ఇచ్చేందుకు చేసుకున్న ఒప్పందంలో భాగంగా పదివేల రూపాయలు ప్రైవేట్ సర్వేయర్ ఎస్ రాజేందర్ రెడ్డి ద్వారా మండల సర్వేయర్ అకౌంటఖరే బదిలీ చేయగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న సర్వేయర్ పెండ్యాల సునీల్ ఫోన్ పే ద్వారా రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నాగార్జున రెడ్డి అనే రైతు భూమి సర్వే చేసి పంచానమా ఇవ్వడానికి 10 వేలు సర్వేయర్ సునీల్ డిమాండ్ చేయగా సదరు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించారు.
ఏసీబీ అధికారుల సూచనల మేరకు సర్వేయర్ సునీల్ అకౌంట్ ఫోన్ పే ద్వారా 10000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ సునీల్ తో పాటు ప్రైవేటు సర్వేయర్ రాజేందర్ రెడ్డిలను విచారించిన అనంతరం ఏసీబి కోర్టుకు తరలించనున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.