ఓదెల, ఆగస్టు 19 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM)లో భాగంగా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్ , రోటావేటర్, స్ట్రా బేలర్, కేజు వీల్స్, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్, బండ్ ఫార్మర్, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్, బ్రష్ కట్టర్ లాంటి వ్యవసాయ పనిముట్లు చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50% రాయితీ పై అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అవసరం ఉన్న రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ట్రాక్టర్ తో నడిచే పనిముట్లకి ట్రాక్టర్ ఆర్.సి., దరఖాస్తు ఫారంతో వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇవ్వాలని సూచించారు. గతంలో లబ్ధి పొందని రైతులకు ప్రాధాన్యత ఇస్తారన్నారు.