Sigachi Pharma | పెద్దపల్లి టౌన్, జులై 15 : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మైలారం సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 52 మంది కార్మికులు మృతిచెందగా.. మరో 34 మంది తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారని తెలిసిందే. మరో ఎనిమిది మంది ఆచూకీ కూడా దొరకలేదని ఇలాంటి ఘోర ప్రమాదానికి కారణమైన సిగాసి పరిశ్రమ యాజమాన్యంపై హత్య నేరం నమోదు చేసి జైలుకు పంపాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సి పెళ్లి రవీందర్, జ్యోతి, తోకల రమేష్, ఈదున్నూరు నరేష్ శంకర్ మాట్లాడుతూ.. సిగాచి ఫార్మా కంపెనీలో పనిచేస్తూ మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇష్టానుసారంగా యాజమాన్యాలకు అనుకూలంగా ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని ఆరోపించారు.
కార్మికుల హక్కులను, కార్మిక చట్టాలను కాలరాస్తూ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా కార్మికుల ప్రాణాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ వేణుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, బాలకృష్ణ, జ్యోతి, నరేష్ కుమార్, రాజేశం, మల్లేశం తదితరులు ఉన్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి