రామగిరి ఫిబ్రవరి 16 : నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించాలని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ(L.V. Suryanarayana) అన్నారు. వారు ఆదివారం అడ్రియాల లాంగ్ వాల్ గనిని సందర్శించారు. నూతనంగా డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఎ.ఎల్.పి గనిని సందర్శించారు. ఈ సందర్భంగా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సూర్యనారాయణ సంబధిత అధికారులతో సమీక్ష నిర్వహించి బోల్టర్ మైనింగ్, లాంగ్ వాల్ పనుల పై చర్చించారు. అనంతరం ఆయన మట్లాడుతూ లాంగ్ వాల్ సాల్వెజింగ్ పనులు త్వరగా పూర్తిచేసి, లాంగ్ వాల్ నుంచి భద్రతతో కూడిన ఉత్పతి లక్ష్యాలను, సాధించాలన్నారు. అందుకు తగిన చర్యలు చేపట్టాలని పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జీఎం బండి సత్యనారాయణ, ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం, డీజీఎం కె.జనార్దన్ పాల్గొన్నారు.