కోల్ సిటీ, జూన్ 5: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం బీఆర్ఎస్ యువజన నాయకుడు పల్లె రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని నగరంలోని పలు ఆశ్రమాల్లో వేడుకలను నిర్వహించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్యతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆశ్రమాల్లోని వృద్ధులకు, పిల్లలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ కోలేటి దామోదర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తన పదవితోపాటు పోలీస్ శాఖకు వన్నె తీసుకవచ్చాడని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో కోలేటి శ్రీను, పీటీ స్వామి, నారాయణదాసు మారుతి, దొమ్మేటి వాసు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెలిశెట్టి నటరాజ్, వెంకటరమణ, సంపత్, మహేష్, నవీన్, అజయ్, నిఖిల్, ఫణి, నవీన్, రాంబాబు, యశ్వంత్ రెడ్డి, శ్రీరామ్, కార్తీకేయ, ప్రేమ కుమార్ తదితరులు పాల్గొన్నారు.