పెద్దపల్లి మే 6( నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని టీఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బహూత్ కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఉద్యోగ ఉపాధ్యాయ లోకాన్ని తీవ్రంగా బాధించిందన్నారు. రాష్ట్ర ఉద్యోగులు ప్రజలు కానట్టు, మాకు రావల్సిన ఐదు డీఏలు ఐదు సంవత్సరాలకు పీఆర్సీ, పెండింగ్ బిల్లులు మాత్రమే త్వరగా ఇవ్వాలని అడిగామన్నారు. దానిని ఏ పథకం ఆపి ఇవ్వాల్నో మీరే చెప్పండని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలేనని అవి కొత్తవేం కావన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా భాగమేనని అన్నారు. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రిటైర్ అయిన వారికి పూర్తి బెనిఫిట్స్ అందించాలని, డీఏలు, పీఆర్సీ మొదలగు వాటిని వెంటనే ప్రకటించాలని అన్నారు. అలాగే హెల్త్ కార్డ్స్ అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లే విధంగా చర్యలు తీసుకోవాలని కిశోర్ కోరారు.