పాలకుర్తి : బసంత్ నగర్ కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మికులు సోమవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు(KCR birthday) ఘనంగా నిర్వహించారు. కేశోరామ్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరన్న, ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
దుష్ట కాంగ్రెస్ పాలనా అంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలన్నారు. దశాబ్దాల అణిచివేత, దోపిడీ పీడల నుంచి తెలంగాణ జాతికి విముక్తి కల్పించారన్నారు. ఉమ్మడి పాలనలో మన భాష, యాసలను అవహేళలనకు గురవుతుంతే కేసీఆర్ ఉద్యమించి స్వరాష్ట్ర కలను నిజం చేశారన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.