పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూదాత భూమయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 25 నుంచి 26వ తేదీ వరకు శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆలయ నిర్మాణ దాత కోలేటి దామోదర్ గుడి నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణం తర్వాత రెండో బ్రహ్మోత్సవం అయినందున ఈసారి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని గ్రామస్తులు తెలిపారు.