Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తున్నది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరిఖని – మంథనికి రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం నగరపాలక మేయర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అత్యవసరంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కాగా, పెద్దప ల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ధర్మారం 95.8 పాలకుర్తి 114.4, అంతర్గం 101.2, రామగుండం 135, పెద్దపల్లి 111.6, జూలపల్లి 51.4, ఎలిగేడు 63.8, సుల్తానాబాద్ 42.6, ఓదెల 42.8, కాల్వశ్రీరాంపూర్ 47.6, కమాన్ పూర్ 141.4, రామగిరి 108.6, మంథని 88.6, ముత్తారం 49.8. మి.మీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
