Rain | జూలపల్లి మండలంలో దంచి కొట్టిన వర్షం..!
జూలపల్లి, జూన్ 27 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో వర్షం దంచి కొట్టింది. శనివారం రాత్రి దాదాపు గంట సేపు ఉరుములు మెరుపులతో భారీ వాన కురిసింది.
జూలపల్లి, జూన్ 27 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో వర్షం దంచి కొట్టింది. శనివారం రాత్రి దాదాపు గంట సేపు ఉరుములు మెరుపులతో భారీ వాన కురిసింది. నెల రోజుల నుంచి ముఖం చాటేసిన వరుణుడు కరుణించటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నైరుతి రుతుపవనాల రాకతో మరిన్ని వానలు పడే అవకాశం ఉండడంతో మండలంలో మండలం వ్యాప్తంగా సాగు పనులు జోరందుకోనున్నాయి.
నైరుతి రుతుపవనాల ఆలస్యంతో చినుకు పడేదెప్పుడు? అని ఆకాశంకేసి చూస్తున్న రైతన్నలను వరుణుడు కరుణించాడు. జూలపల్లి మండలంలో ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులకు తీపికబురు చెబుతూ భారీ వాన కురిసింది. వానాకాలం నేపథ్యంలో పలువురు పొలాల్లో వరి నార్లు పోసుకొని సిద్ధమయ్యారు.
కొంతమంది రైతులు పత్తి విత్తనాలు వేసుకుని వర్షాల కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో రైతుల నుంచి సంతోషం వ్యక్తం అవుతుంది. వాన కారణంగా ఓ వైపు ఎండ తీవ్రతతో ఉక్కపోత భరించలేకపోయిన ప్రజలకు ఉపశమనం లభించింది. మరో వైపు లోతట్టు ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి వరద నీరు చేరడంతో కొందరు ఇబ్బందులు పడ్డారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

