సుల్తానాబాద్ రూరల్ నవంబర్ 27 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి గ్రామంలోని తిరుమలాయగుట్ట పైన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి గురువారం కన్నా రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. దాదాపు 27 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
దాదాపుగా రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పులి ఐలయ్య, మాదాసు శ్రవణ్, ఆది కోటేశ్వరరావు, కుందేళ్ల కనకయ్య, సంకరి సంపత్, భూమేష్ లతోపాటు తదితరులున్నారు.