Government Degree College students | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 09: క్షేత్ర పర్యటన లో భాగంగా పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు యువ టూరిజం క్లబ్ లో భాగంగా కళాశాల సమీపంలోని పెద్దకల్వలలో చారిత్రక నేపథ్యం కల్గిన మహమ్మాయి దేవి అమ్మవారి దేవాలయాన్ని బుధవారం సందర్శించారు. దేవాలయ ఆవరణ లో గల హుస్సేన్ మియా వాగు లో పారుతున్న నీటి శాంపిల్స్ ను తమ ప్రయోగ నిమిత్తం సైన్స్ విద్యార్థులు సేకరించారు.
Degree
అలాగే మార్గ మధ్యలో ఉన్న తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ గిడ్డంగి ని సందర్శించి అక్కడి అధికారుల నుండి విత్తన నిల్వలు, పంపిణీ కి సంబంధించిన పలు విషయాలను వాణిజ్య శాస్త్ర విద్యార్థులు తెలుసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే లక్ష్మి నర్సయ్య విద్యార్థులను అభినందించారు. క్షేత్ర పర్యటన ద్వారా సైన్స్ ,కామర్స్ ,ఆర్ట్స్ విద్యార్థులు వారికి సంబంధించిన సబ్జెక్టు సంబంధ విషయ పరిజ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంతో, ఎక్కువ విజ్ఞానాన్ని పొందవచ్చని, ఈ పర్యటనద్వారా విద్యార్థులను ప్రోత్సహించిన అధ్యాపకులను అభినందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఈ పర్యటనలో విద్యార్థుల తో పాటు కళాశాల ,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ సతీష్ కుమార్, అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.పురుషోత్తం, టీఎస్ కేసీ కో-ఆర్డినేటర్ డాక్టర్ సీ.హెచ్. మారుతి, యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్. తిరుపతి, ఎన్ సీసీ ఏఎన్ ఓ లెఫ్టినెంట్ కల్నల్ కంజర్ల శ్రీలత అధ్యాపకులు సునీత, కె.అంజయ్య, యం.విజయ్ కుమార్ ,కె.సతీష్, జి. రమేష్, వి.వంశీ తదితరులు పాల్గొన్నారు.