Bathukamma | పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌గాంధీ నగర్‌లోని శ్రీచైతన్య హైస్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్‌లో బతుకమ్మ, దసరా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రకరకాల పూలతో విద్యార్థినులు బతుకమ్మలను అందంగా పేర్చారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను హైస్కూల్ ప్రాంగణంలోని మైదానం మధ్యలో పెట్టి విద్యార్థినులు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. ఉపాధ్యాయినులతో కలిసి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల.. బంగారు బతుకమ్మ ఉయ్యాల అంటూ పాటలు పాడుతుంటూ.. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ జోజి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని తెలిపారు. పూలను దైవంగా భావించి బతుకమ్మగా పూజించడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
Bathukamma
Bathukamma1