కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి10 : కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలను ఎత్తుకెళ్లిన దొంగలను(Goat thieves) అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానుపాటి శేఖర్( కరీంనగర్), శివరాత్రి రమేశ్, (కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట), మానుపాటి సంజీవ్‌కుమార్ (చొప్పదండి) తో పాటు మరికొంత మంది కలిసి అప్పుడప్పుడు మద్యం పార్టీలో కలుసుకునేవాళ్లు. విలాసాల కోసం రాత్రి పూట ఇళ్లలో దొంగతనాలు చేయాలని పథకం వేశారు. ఈనెల 2న నిందితులందరు కలిసి రెండు కార్లలో కార్ నెం( టీఎస్ 29హెచ్ 0108) కొత్త బొలేరో క్యాంపర్ వ్యాన్‌లో ఆర్ధరాత్రి కాల్వశ్రీరాంపూర్ కు బయలు దేరారు.
కాల్వశ్రీరాంపూర్ కు చేరుకున్న తరువాత ఈనెల3న అర్ధరాత్రి సమయంలో తిప్పనవేన ఎర్ర కొమురయ్య ఇంటి కాంపౌండ్ గోడ దూకారు. అక్కడ మనుషులు ఉండడం చూసి అక్కడే ఉన్న మేకల కొట్టం నుంచి 3, మేకలను దొంగిలించి, వారి వాహనాల్లో ఎక్కించుకొని, తరువాత అదే రాత్రి మల్యాల గ్రామానికి వెళ్లి బొల్లి రాజయ్య ఇంటిలో చొరబడి 2 మేకలను ఎత్తుకెళ్లి చొప్పదండికి పారిపోయారు. చొప్పదండి చేరుకున్న తరువాత 5మేకలను నిందితుడు మానుపాటి సంజీవ్ కుమార్ కొట్టంలో ఉంచారు.
ఈనెల 9న మళ్లీ దొంగతనం చేద్దాం అనుకొని కాల్వశ్రీరాంపూర్ కు నిందితులు శివరాత్రి రమేశ్, మానుపాటి సంజీవ్ కుమార్ ఎర్టికా కారులో వస్తుండగా గంగారం క్రాస్ రోడ్డు వద్ద పక్కా సమాచారం మేరకు నిందితులను కున్నామని ఎస్ఐ తెలిపారు. ఐదు మేకలను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.