కోల్ సిటీ, మార్చి 23: రంజాన్ పండుగ వచ్చిందంటే నిరుపేద ముస్లిం కుటుంబాలకు కేసీఆర్ ఒక భరోసా.. ఈయేడు కేసీఆర్ ప్రభుత్వ లోటుతో ముస్లిం కుటుంబాలు బాధపడవద్దనే ఉద్దేశంతో వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఆ బాధ్యత తీసుకుంది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి సహకారంతో రామగుండం నగర పాలక సంస్థ తాజా మాజీ కో- ఆప్షన్ తన్నం భాను, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహెద్ పాష ముస్లింలకు భారీగా కానుకలు అందించి ఆ లోటును పూడ్చారు. దాదాపు 500 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించి వారిలో ఆనందం నింపారు.
గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు జమీలుద్దిన్, వీహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వ్యాల అనసూయ రాంరెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు తన్నం భాను ముఖ్యతిథిగా హాజరై నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా (నిత్యవసర సరుకులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవడం కోసం ప్రతి ఏటా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రంజాన్ పండుగకు ముందే కానుకలు ఇచ్చేవారని గుర్తు చేశారు.
కేసీఆర్ స్ఫూర్తిగా ఈయేడు కూడా పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్వర్, సిగిరి రాము, ఫయాజ్ అలీ, హుస్సేన్, టిప్పు సుల్తాన్, పొలాడి శ్రీనివాస రావు, వంశీకృష్ణ, కొండ సురేష్, నర్సింగరావు, కడార్ల శ్రీధర్, అన్ను, బురహాన్ వందల సంఖ్యలో ముస్లిం మహిళలు పాల్గొన్నారు.