Forest fire | ఎల్లారెడ్డిపేట మార్చి 8 : గుండారం అడవి బుగ్గయిన ఘటనపై ఎఫ్ఆర్వో శ్రీహరి ప్రసాద్ అందుకు గల కారణాలపై వాకబు చేశారు. ఇవాళ దగ్ధమైన అటవీ ప్రాంతాన్ని సందర్శించి వన దహనానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అడవి సహజంగా అంటుకుందా..? ఎవరైనా వ్యక్తులు ఉన్నారా..? అనే వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు.
అడవి మంటలు అంటుకోవడానికి ఒకవేళ వ్యక్తుల ప్రమేయం ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంటలంటుకున్న భూమిలుపోడు భూములేనే లేదని తేల్చి చెప్పారు. గత మూడేళ్ల క్రితం ఐదు ప్యాచ్ల్లో సుమారు 60 వేల మొక్కలు నాటామని ఇటీవల మొక్కలు చుట్టూ గడ్డిని తొలగించి సాయిల్ వర్క్ చేయించామని దీంతో మెజారిటీ మొక్కలకు నష్టం జరగ లేదని అన్నారు.
సర్వైవల్లో ఉన్న మొక్కలపై వివరాలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఇక్కడ ఎఫ్ఎస్ఓ సకారం నాయక్ సిబ్బంది ఉన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్