పెద్దపల్లి, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటుచేసిన వేదికపై జన్మదిన కేక్ ను చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు దాసరి మనోహర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పదేళ్లపాటు పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా వినలేదు సేవలందించాలని కొనియాడారు.
మనోహర్ రెడ్డి జన్మదిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్యారేజ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి స్వగృహంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచడం జరిగింది, అదే విధంగా ప్రభుత్వ వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, బీ ఆర్ ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు కోయడ సతీష్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, నాయకులు వెన్నం రవీందర్ -సుజాత, తానిపర్తి మోహన్ రావు, నూనెటి సంపత్ యాదవ్,సలేంద్ర రాములు యాదవ్, గుండేటి మధు, మోబిన్ ,నాంసాని సరేష్ బాబు, పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, జహీర్, బాలసాని ఈశ్వర్, చొప్పరి అన్వేష్, లవన్ కుమార్ , మహమ్మద్ ఖాదర్, పల్లె మధు, నూనెటి కుమార్ యాదవ్, సుధీర్, ఆకుల వివేక్ పటేల్, తాని నరేష్ పటేల్ తో పాటుగా, పలువురు మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.