పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 08 : పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త జనగామ సదయ్య కుమారుడు ఈనెల తేదీ 5వ తేదిన రాత్రి పాము కాటుకు గురై పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో చికిత్సపొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దవాఖానకు వెళ్లి చికిత్సపొందుతున్న సదయ్య కుమారుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ లను కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులున్నారు.