కోల్ సిటీ, మార్చి 10 : రామగుండం నియోజకవర్గంలో పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో గోదావరిఖనిలో ఆటో కార్మిక సేవా సమితి(Auto Karmika seva samithi) అనే స్వచ్ఛంద సంస్థ ఆవిర్భవించింది. ఈ మేరకు ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షుడిగా వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షుడిగా కడార్ల శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఎల్కపెల్లి అంజయ్య, ముఖ్య సలహాదారుగా బీఆర్ఎస్ నియొజవర్గ అధికార ప్రతినిది జాహిద్ పాషా, సలహాదార్లుగా పోలాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్, డోలి శ్యాం సుందర్, ముత్యాల శంకర్, రాపెల్లి వెంటేష్, నేరేల్ల సత్యనారాయణ, వడ్లూరి రాజశేఖర్ ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆటో కార్మికులు గాజుల చంద్రమౌళి, మాహ్మద్ రఫీ కుటుంబాలకు ఒక్కక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జాహిద్ పాషా మాట్లాడుతూ ఆటో కార్మిక సేవా సమితి ముఖ్య ఉద్దేశం పేద ఆటో కార్మిక అన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. అందుకు హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయూతతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుర్హాన్, నీలారపు రవి, నమేండ్ల కుమార్, ఎండీ అన్ను, చందర్, కొండ సంపత్ పాల్గొన్నారు.