కోల్ సిటీ , మార్చి 20 : ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరిఖని 33వ డివిజన్లో గురువారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డివిజన్ కు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికులు, స్థానికులు దాదాపు 200 మంది వరకు హాజరు కాగా, వైద్యులు డా. నాగరాజు, డా. వేణు, డీఎంఓ డా. హర్షిత్ హాజరై వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు. గుండె, బీపీ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు. మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
హాస్పిటల్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలు, సింగరేణి రిటైర్డు కార్మికుల కుటుంబీలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ శిబిరంలో సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్, సభ్యులు ఎం.శ్రీనివాస్, పెరుక శ్రీనివాస్, లెనిన్, జూల మోహన్, రవి, నరేంద్ర, గోవర్ధన్, ప్రణీత్, పద్మ, లక్ష్మి, సౌజన్య, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, హరీష్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.