పెద్దపల్లి, సెప్టెంబర్16: లయన్స్క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అమర్ చంద్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెద్దపల్లి పట్టణంతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 35 మందికి ఆపరేషన్ అవరమున్నట్లు గుర్తించినట్లు క్లబ్ అధ్యక్షుడు బోడకుంట రాంకిషన్ తెలిపారు.
కంటిలో శుక్లాలు ఉండి కంటి చూపు మందగించి ఆపరేషన్ అవసరం ఉన్న 35 మందిని ప్రత్యేక బస్సులో రేకుర్తి తరలించామని, వారికి బుధవారం ఉచితంగా కాటరక్ట్ ఆపరేషన్ చేయిస్తామని తెలిపారు. ఈ క్యాంపులో రేకుర్తి హాస్పిటల్ సిబ్బంది ప్రభాకర్, క్లబ్ కార్యదర్శి మీసాల సత్యనారాయణ, కోశాధికారి మహేందర్ రావు, జోన్ చైర్ పర్సన్ సాదుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు జక్కుల సాయిలు, సీనియర్ సభ్యులు కావేటి రాజగోపాల్, బెల్లంకొండ జయపాల్ రెడ్డి, నీలయ్య, కటారి విజిత్ సింహ రావు, వరాహ గిరి, వనపర్తి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.