Environmental protection | రామగిరి, మే 28 : పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో బుధవారం పర్యటించారు. ముందుగా జీఎం కార్యాలయం ఆవరణలో 22 మే నుంచి 5 జూన్ వరకు నిర్వహిస్తున్న పర్యావరణ వక్షోత్సవాల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జీఎం కార్యాలయ అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు ఉద్యోగులకు జ్యూట్ బ్యాగ్స్ అందజేశారు.
తదుపరి జీఎం కార్యాలయ ఆవరణ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోవాలని, ముఖ్యంగా ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ ను అసలే వాడద్దని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. అనంతరం ఓసిపి-1 ఉపరితల గని రెమిడేషన్ ప్లాన్ లో భాగంగా జూలపల్లి, ముల్కలపల్లి, పన్నూర్, రత్నాపూర్, నాగేపల్లి గ్రామాలలో చేపట్టిన చెక్ డ్యామ్ లు, సీసీ రోడ్లు, సోలార్ లైట్లు, ఇంకుడు గుంతలు, బస్ షెల్టర్లు, ప్లాంటేషన్ పనులను పరిశీలించారు.
ఓసిపి-1 ఉపరితల గని లోని వ్యూ పాయింట్, పండ్ల మొక్కల పెంపకం, విండ్ బ్యారియర్, గ్రీన్ బ్యారియర్, ఎస్ టి పి ప్లాంట్ మొదలగునవి పరిశీలించారు. ఓసీపీ -1 రెమిడేషన్ ప్లాన్ లో భాగంగా చేపట్టిన పనుల వివరాలను రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ సైదులు, ఎస్వోటూ జీ ఎం ఎం రామ్మోహన్, ఏరియా ఇంజనీర్ వై వి.శేఖర్ బాబు, ఫైనాన్స్ ఎజియం పి.శ్రీనివాసులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, ఎన్విరాన్మెంట్స్ డీజీఎంలు పి.రాజారెడ్డి, కిషన్, సివిల్ డీ జీయం రాజేంద్ర కుమార్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ఫారెస్ట్రీ విభాగాధిపతి కళ్యాణ్,కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులు సిహెచ్. శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.