పెద్దపల్లి(ఎలిగేడు), ఫిబ్రవరి19: చేసిన పనికి డబ్బులు బ్యాంకు ఖాతాలో పడటం లేదంటూ ఎలిగేడు మండల కేంద్ర ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం(Eligedu MPDO office) ముందు బైఠాయించారు. పని ఎక్కువ చేయించుకొని తక్కువ పైసలు ఇస్తున్నారని ఆందోళ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..ఎర్రటి ఎండలో కష్టపడి పని చేస్తుంటే చేసిన కొలతలు తేడా చూపుతూ తక్కువ డబ్బులు వేస్తున్నారని ఆరోపించారు.
రోజు పని చేస్తున్న డబ్బులు రావటం లేదని, పని స్థలంలో కనీస సౌకర్యాలు కల్పించటంల లేదని అవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీడీవో భాస్కర్రావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. పని స్థలానికి వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలించి కొలతల ప్రకారం డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాని చెప్పారు. దీంతో ఉపాధి హామీ కూలీలు అందోళన విరమించి యధావిధిగా పనులు చేశారు.