RAMAGUNDAM | పెద్దపల్లి, ఏప్రిల్ 10( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాకు భూకంప హెచ్చరిక వచ్చింది. ఈనెల 10 నుంచి 17 మధ్య ఈ భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎపిక్ ఎర్త్ క్వీక్ రీసెర్చ్ ఎనాలసిస్ సెంటర్ తెలిపింది. దీని ప్రభావం పెద్దపల్లి జిల్లా రామగుండం పై ఉండే అవకాశం ఉన్నట్లు గుర్తించింది.
రామగుండం లో భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లుగా ఆ సంస్థ తన ట్విట్టర్ లో పేర్కొంది. దీంతో పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ లలో సంభవించిన భూకంపం దాటికి భారీగా ప్రాణ నష్టం ఆశ నష్టం సంభవించిన విషయం వితమే.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం కు భూకంప హెచ్చరిక జారి కావడం పట్ల సర్వత్ర ఆందోళన నెలకొంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో స్వల్ప భూకంపం జరిగిన దాని తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం పూర్తిగా సింగరేణి భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉండటంతో ప్రమాద తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది. భూకంప తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.