ధర్మారం, అక్టోబర్ 29 : విద్యార్థులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని పెద్దపల్లిరాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్ బి ఎస్ కే) డాక్టర్ అనిత అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఆర్.బి.ఎస్.కె ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆహారపు అలవాట్లను ఆమె అడిగి తెలుకున్నారు. విద్యార్థులు తీసుకునే ఆహారంలో పాలు,పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. జంక్ పుడ్ మానేయాలని అన్నారు.
అలాగే చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించుట వలన వారికి కంటి చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిల్లలకు తమ ఇండ్లలో తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇవ్వవద్దని ఆమె హితవు పలికారు. ఈ సందర్భంగా బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి బి విటమిన్ మాత్రలు అందించారు. రక్తహీనత గల విద్యార్థులకు రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ నూతి మల్లయ్య, బాల స్వాస్త్య డాక్టర్ మల్లేష్,ఏ.ఏన్.ఏం సఫియా, ఫార్మాసిస్ట్ మమత ,సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు సిరిపురం సునిల్, సి ఆర్ పి ఏదుల్ల ప్రేమ్ సాగర్,వీవీ లు అరుణశ్రీ, స్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.