సుల్తానాబాద్ రూరల్ జూలై 29 : రైతు కూలీలకు వర్షాకాలంలో పనులు చేస్తుండగా తడవకుండా ఉండేందుకు పడాల అజయ్ గౌడ్ కవర్లను సరఫరా చేయగా స్థానిక నాయకులు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలోని మహిళా రైతు కూలీలకు మంగళవారం పడాల అజయ్ గౌడ్ సహకారంతో కుంచెలు (కవర్లు) ఐతరాజుపల్లి మాజీ వార్డు సభ్యులు మడ్డి సాయి కిషోర్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి రమణారెడ్డి, సురేష్, తిరుపతి, ధర్మయ్య, రామకృష్ణ, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Meerut Hospital | వైద్యం చేయకుండా ఏసీ వేసుకొని నిద్రపోయిన వైద్యుడు.. తీవ్ర రక్తస్రావంతో వ్యక్తి మృతి