Fennel Seeds Water | సోంపు గింజల నీళ్లను రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే తాగడం ప్రారంభిస్తారు..!
భోజనం చేసిన తరువాత కొందరు సోంపు గింజలను తింటుంటారు. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, గ్యాస్ కూడా ఏర్పడకుండా అడ్డుకోవచ్చు. అయితే సోంపు గింజలను వాస్తవానికి రోజూ తినవచ్చు.
Fennel Seeds Water | భోజనం చేసిన తరువాత కొందరు సోంపు గింజలను తింటుంటారు. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, గ్యాస్ కూడా ఏర్పడకుండా అడ్డుకోవచ్చు. అయితే సోంపు గింజలను వాస్తవానికి రోజూ తినవచ్చు. కానీ వీటిని తినడం అంతగా ఇష్టపడకపోతే సోంపు గింజలను నీటిలో వేసి మరిగించి డికాషన్లా తయారు చేసి తాగవచ్చు. లేదా రాత్రి పూట సోంపు గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగవచ్చు. సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సోంపు గింజల నీళ్లను తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయ కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో పొట్టలో ఉండే అసౌకర్యం తొలగిసోతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అజీర్తి తగ్గుతుంది.
బరువు తగ్గేందుకు..
సోంపు గింజల నీళ్లను సేవించడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అసిడిటీ తగ్గుతుంది. ఐబీఎస్ అనే అనారోగ్య సమస్య ఉన్నవారు ఈ నీళ్లను తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ నీళ్లను తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు. ఈ నీళ్లలో సహజసిద్ధమైన డై యురెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో అధికంగా ఉండే నీటిని బయటకు పంపిస్తాయి. దీంతో బరువు తగ్గవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు సైతం బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
మూత్రాశయ సమస్యలకు..
సోంపు గింజల నీళ్లను తాగడం వల్ల మూత్రం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా సోడియం తగ్గించబడుతుంది. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు ఈ నీళ్లను తాగితే మేలు జరుగుతుంది. మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రం ధారాళంగా సాఫీగా జారీ అవుతుంది. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, క్వర్సెటిన్, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ను నిర్మూలిస్తాయి. దీంతో తీవ్రమైన వ్యాధులు తగ్గిపోతాయి. ముఖ్యంగా గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది.
మహిళల సమస్యలకు..
సోంపు గింజల నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియంను తగ్గించడంతోపాటు రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీబీ ఉన్నవారు ఈ నీళ్లను రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. సోంపు గింజల నీళ్లను తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె పోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు రోజూ సోంపు గింజల నీళ్లను తాగుతుండాలి. ఈ గింజల్లో అధికంగా ఉండే ఫైటో ఈస్ట్రోజెన్స్ హార్మోన్ల అసమతుల్యతలను తగ్గిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ నీళ్లను తాగితే హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో రుతుక్రమం సరిగ్గా వస్తుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా సోంపు గింజల నీళ్లను రోజూ తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

