పెద్దపల్లి, ఆగస్టు12 : పెద్దపల్లి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ పని తీరుపై కలెక్టర్ సమీక్షించారు. సీసీ రోడ్లు, ప్రభుత్వ దవాఖానలు, సబ్ సెంటర్ల నిర్మాణం, మర్మమతు పనుల పురోగతిపై ఆరా తీశారు.
హెల్త్సెంటర్స్మరమ్మతు పనులు, సబ్ సెంటర్ భవనాలు, పాఠశాలల మరమ్మతులు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హస్టల్స్మరమ్మతు పనులకు నిధులు మంజూరు చేశామని, ఆ నిధులను వినియోగించుకుంచుకోవాలని సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ గిరీష్ బాబు, సీపీవో రవీందర్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.