ధర్మారం, ఫిబ్రవరి11: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయా అరుణ(Daya Aruna) అన్నారు. ఈ మేరకు మంగళవారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని బొమ్మరెడ్డిపల్లిలో రెండు అంగన్వాడీ కేంద్రాలలో(Anganwadi centers) మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి సంసిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా గర్భిణిలు అనేక జాగ్రతలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆడపిల్లల సంరక్షణ, ఉన్నత విద్య, మహిళల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అంగన్వాడీ సేవలను, బాల్య వివాహాలను అరికట్టాలని, ఆడపిల్లల పట్ల వివక్షత చూపవద్దని అని ఆమె అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్, సఖి సేవలు, పీసీ, పీఎన్డీటీ చట్టం, సీనియర్ సిటిజన్స్ సేవలు, పని ప్రదేశాల్లో మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించిన చట్టం, సైబర్ నేరాలపై ఆమె మహిళలకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో అవసరమయ్యే హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు బ్లాండిన, అంగన్వాడీ టీచర్లు బుచ్చమ్మ, కవిత, ఆశ వర్కర్ ఆర్.లలిత, ఆయాలు, మహిళలు పాల్గొన్నారు.