పెద్దపల్లి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆనవాళ్లను తెలంగాణలో లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఆయన ఆనవాళ్లు కాదు కదా రాష్ర్టంలో ఆయన నాటించిన మొక్కలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీక లేడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉషా అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం కేసీఆర్ గ్రౌండ్లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో(KCR birthday) ఆమె ఓదెల మాజీ జడ్పీటీసీ గంటా రాములుతో కలిసి పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పెద్దపల్లి నియోజకవర్గం ఇన్చార్జి బొల్లం భూమేష్ ఆధ్వర్యంలో 101 మొక్కలు నాటి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహా యోధుడు కేసీఆర్ అన్నారు. ఎంతో మందికి రాజకీయ భిక్షపెట్టి నేడు వాళ్లు ఉన్నత పదవులను అధిరోహించేందుకు కేసీఆర్ కారణమయ్యాడన్నారు. ఆయన పాలనలో యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండేదన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని, త్వరగా తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మర్కెట్ డైరెక్టర్ సలవేన రాములు, మాజీ ఎంపీటీసీ కాల్వల రవి, చిన్న కాల్వల ఎంపిటిసి గుర్రం సంపత్, మాజీ వార్డు సభ్యులు కాల్వల గోపాల్, కాల్వల శ్రీనివాస్, కాల్వల రవి, భూమేష్, దొడ్డి అశోక్, బీరం రవి, చిట్ట వెని వినిత్, పల్లె రాకేష్, రవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.