పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 14 : విద్యార్థులు జీవితంలో స్థిరపడేందుకు ఉన్నత లక్ష్యసాధనతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్ఢి అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం ట్రినిటీ డిగ్రి , పీజీ కళాశాలలో ట్రినిటీ తరంగ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడారు.
విద్యార్థులు తల్లి దండ్రుల ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. పెద్దపల్లి జిల్లా వాసులకు ఈ ప్రాంతంలో అన్ని రకాల విద్యను దూరప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగామన్నారు. అనంతరం ట్రినిటి డిగ్రీ కళాశాలనుంచి, కళాశాలలో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు , బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.నీతారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రాంచందర్, అధ్యాపకులు మనోహర్ , వెంకన్న బాబు, సంజీవరెడ్డి, శేఖర్, భిక్షపతి, శ్రీనివాస్ , సరిత, నిర్మల పాల్గొన్నారు.