పెద్దపల్లి : మద్యం మత్తులో ఘర్షణ చోటుచ చేసుకోవడంతో ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..ఎన్టీపీసీ టౌన్షిప్లో జరుగుతున్న భవన నిర్మాణం పనులకు వలుస వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు అక్కడే షెల్టర్ ఏర్పాటు చేయడంతో రాత్రి మద్యం మత్తులో డబ్బుల కోసం ఇద్దరి కాంట్రాక్టు కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది.
దీంతో ఇనుపరాడ్డుతో తలపై కొట్టడంతో చంద్రపూర్ మహారాష్ట్రకు చెందిన వినోద్ బుహాజీ సోంకర్ అనే కాంట్రాక్టు లేబర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.