Nandi Medaram : నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిలాఫలకం గోడ నిర్మించడంపై వివాదం రాజుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తమ పార్టీ గద్దె దగ్గరే శిలాఫలకం ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. వాస్తవానికి జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా.. వెటర్నరీ వైద్యశాల వెనుక ఐకేపీ భవన నిర్మాణానికి ఆదివారం మంత్రి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే.. భవనం శంకుస్థాపన కోసం మెయిన్ రోడ్డులో ఉన్న బీఆర్ఎస్ జెండా సమీపాన కాంగ్రెస్ పార్టీ నాయకులు శిలాఫలకం గోడ నిర్మించారు.
‘ఇదేంటీ? మా పార్టీ గద్దెకు దగ్గర శిలాఫలకం నిర్మించారు?’ అని బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. శిలాఫలకం గోడను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో.. విషయం తెలిసి గ్రామానికి చేరుకున్న ధర్మారం ఎస్సై ఇరు వర్గాలతో చర్చించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే ఏర్పాటు చేసిన శిలాఫలకం గోడ
