పెద్దపల్లి : భూమి కోసం, భుక్తి కోసం, సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తి దాయకం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ మమతారెడ్డి, అదనపు కలెక్టర్ వి.లక్ష్మినారాయణతో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజ హితం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ వెలకట్టలేనిదన్నారు.