కాల్వ శ్రీరాంపూర్ మార్చి, 12 : కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్‌గా పని చేస్తున్న పుల్లూరు జగదీశ్వర రావు రచించిన బాలల కథల పుస్తకం లిటిల్స్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Sriharsha )బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు. 24 కథల బాలల పుస్తకం తెలుగు, ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉందన్నారు.
సైన్స్‌ను అందరికీ ముఖ్యంగా విద్యార్థులకు తెలిసేలా చక్కగా చిన్న చిన్న కథలు చెప్పారని ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల గ్రంథాలయాలకు కానుకగా అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పాలనాధికారి శ్రీనివాస్, కాల్వ శ్రీరాంపూర్ నాయబ్ తహసిల్దార్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.