ఫిబ్రవరి 14: పెద్దపల్లి పట్టణంలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజు నూరు శాతం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha )సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్, ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ మేళాను సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రతి సెక్షన్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వార్డు అధికారులు మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్, ట్రేడ్ లైసెన్స్, మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.