గోదావరిఖని, డిసెంబర్ 28 : రామగుండం ప్రజలకు మెడికల్ కళాశాల ప్రసాదించిన దైవం సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సింగరేణి ద్వారా రూ.500 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం సింగరేణి జీడీకే-1వ గని ఆవరణలో పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన హాజరై మాట్లాడుతూ.. కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని రెండుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి పలుమార్లు తీసుకవెళ్లి ఒప్పించినట్లు గుర్తు చేశారు.
సింగరేణి సంస్థ ద్వారా రామగుండంకు కళాశాలను మంజూరు చేయించామన్నారు. నియోజక వర్గ ప్రజల ఐదు దశాబ్దాల కలను సాకారం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నామన్నారు. ఇక్కడ మేయర్ డాక్టర్ అనిల్‌కుమార్, టీబీజీకేఎస్ నాయకులు జాహీద్ పాషా, వడ్డెపల్లి శంకర్, పుట్ట రమేశ్, తదితరులు ఉన్నారు.