పెద్దపల్లి : జిల్లాలోని కమాన్ పూర్ మండల కేంద్రంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆది వరాహస్వామి క్షేత్రాన్ని గురువారం సీఎం కేసీఆర్ పీఏ బెజ్జంకి వేణుగోపాల్ సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేణుగోపాల్‌కు ఆది వరాహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ ఇనగంటి ప్రేమలత శాలువాతో సన్మానించి స్వామి వారి ఫోటోను అందించారు. ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్ నాయకులు ఇనగంటి రామారావుతో పాటు పలువురు ఆలయ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.