పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ఓదెల (Odela) మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై (Manair Vagu) ఉన్న చెక్ డ్యామ్‌ను (Check Dam) దుండగులు కూల్చివేశారు. దీంతో పెద్దమొత్తంలో నీరు దిగువకు వెళ్తున్నది. శుక్రవారం రాత్రి దుండగులు చెక్‌డ్యామ్‌ను కూల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న నీటిపారుదల శాఖ అధికారులు చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. వాగులోని ఇసుకను అక్రమ రవాణా చేసేందుకే ఈ పనికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు. రూ.23 కోట్లకుపైగా నిధులతో ఇటీవలే ఈ చెక్ డ్యామ్‌ను నిర్మించడం గమనార్హం.